![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -75 లో..... కళ్యాణ్ ని తన ఫ్రెండ్స్ తక్కువ చేసి మాట్లాడుతారు. దాంతో వాళ్ళని కళ్యాణ్ కొడుతాడు. అప్పుడే గౌతమి వస్తుంది. గౌతమి నాతో మాట్లాడు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. మీ నాన్న దగ్గర నుంచి తోట కాగితాలు తీసుకున్నావా అని గౌతమి అనగానే తీసుకున్నా గౌతమి కానీ మీ వాళ్ళు మా నాన్నని అవమానించారు బాగా ఫీల్ అవుతున్నాడని కళ్యాణ్ అంటాడు. అయ్యో మా వాళ్ళ తరుపున సారీ అని గౌతమి అనగానే అదే విషయం నువ్వు వచ్చి చెప్పమని కళ్యాణ్ అంటాడు.
మా వాళ్ళతో చెప్పి వస్తానని గౌతమి అనగానే వద్దు మీ వాళ్ళు ఒప్పుకోరు.. మా నాన్న ఫామ్ హౌస్ లో ఉన్నాడని కళ్యాణ్ బలవంతం చేస్తాడు. దాంతో గౌతమి వెళ్తుంది. కొడితే కొట్టాడు గానీ మనం కూడా వెళదాం పదండిరా.. వాడు అనుకున్నది సాధించాడని కళ్యాణ్ ఫ్రెండ్స్ అనుకుంటారు. మరొకవైపు ఇంకా కొరియర్ రావడం లేదని పెద్దావిడ వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత జాను మురళి లాయర్ ని కలిసి మాట్లాడి ఇంటికి వస్తారు. అప్పుడే మురళికి బాబిన్ కొరియర్ తీసుకొని వస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే నైటీ ఉంటుంది. ఇది మా అక్క కోసం ఆర్డర్ చేసావ బావ అని జాను ఆటపట్టిస్తుంది.
ఆ తర్వాత గౌతమి ఇంకా ఇంటికి రాలేదని శారద టెన్షన్ పడుతుంది . అదే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. బావ అక్కని తీసుకొని మీరు ఊళ్ళో వెతకండి.. నేను కాలేజీకి వెళ్తానని జాను చెప్తుంది. జాను కాలేజీలో అందరిని అడుగుతుంది. ఎవరిని అడిగినా కనిపించలేదనే చెప్తారు. మరొకవైపు నందు, మురళి వెతుకుతారు. సూర్యకి జాను ఫోన్ చేసి జరిగింది చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |